ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మహబూబాబాద్ కుర్రాడు.. ఇండియాకు రావాలని ఉంది అంటూ ఫోన్

by Disha News Desk |
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మహబూబాబాద్ కుర్రాడు.. ఇండియాకు రావాలని ఉంది అంటూ ఫోన్
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆవరణలోని యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న గునగంటి రామ్మూర్తి కుమారుడు దుష్యంతు(22) ఉక్రెయిన్ ఇవానో సిటీలో ఎంబీబీఎస్ చదవడం కోసం 2018లో వెళ్ళాడు. ప్రతి సంవత్సరం జూన్‌లో ఇండియాకు వస్తంటాడని, కానీ రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో తమ అబ్బాయిని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నాని రామ్మూర్తి అన్నారు. యుద్ధం జరిగే ప్రాంతానికి తన కొడుకు ఉండే ఇవానోకు 250కి.మీల దూరం ఉంటుందని, చాలా భయంగా ఉందని ఇండియా రావాలని ఉంది డాడీ.. అని నిన్న తనతో మాట్లాడాడని తెలిపారు. ఈ నెల 27న రావాల్సిన తన కొడుకు విమానాలు రద్దు కావడంతో అక్కడే ఆగాల్సి వచ్చిందన్నారు.

Advertisement

Next Story