- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: చాలా కార్యక్రమాలు రద్దు చేసుకుని గాలివీడుకు వచ్చా
దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య(Annamayya) జిల్లా గాలివీడు ఎంపీడీవో(Galiveedu MPDO) కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వచ్చారు. ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీడీవోపై దాడి జరుగడం దురదృష్టకరం అని అన్నారు. తలుపులు పెట్టి మరీ ఎంపీడీవోపై ఫైబర్ కుర్చీతో దాడి చేశారని తెలిపారు. తమది భయపడే ప్రభుత్వం కాదని అన్నారు. చాలా కార్యక్రమాలు రద్దు చేసుకుని ఇక్కడకి రావాల్సి వచ్చిందని తెలిపారు. అంతుకుముందు.. కడప రిమ్స్ ఆసుపత్రి(Kadapa Rims Hospital)లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పారు.
విధి నిర్వహణలో ఉన్న ఏ ఉద్యోగిపై దాడికి పాల్పడినా సరే కఠిన చర్యలు తీసుకోవలసిందిగా, అదే విధంగా దాడికి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న మిగతా 9 మందిని త్వరగా అరెస్టు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అధికారులపై దాడి చేయడం వైసీపీ(YCP)కి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. ఎంపీడీవో అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారి అని చెప్పారు. జవహర్ బాబును దారుణంగా కొట్టారని.. ఆయనపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా పలువురు అధికారులపై దాడి చేశాడని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా వైసీపీ రాజ్యం ఉందని భ్రమ పడుతున్నారని అన్నారు. 11 సీట్లు వచ్చినా వీళ్లకు ఇంకా అహంకారం తగ్గలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.