ఆదివాసీలపై వేధింపులు ఆపండి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

by Vinod kumar |
ఆదివాసీలపై వేధింపులు ఆపండి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
X

దిశ, ఫరూక్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖలో వ్యవసాయ కార్మికులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేసే వాళ్లకు అప్పులు తప్ప ఆస్తులు లేకుండా ఉన్నారని, అలాగే వారి సమస్యలపై పోరాడుతున్న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారికి సమస్యలను ప్రభుత్వం వెలికితీసి న్యాయం చేయవలసిందిగా కోరడం జరిగింది.

వ్యవసాయ కార్మికులకు రక్షణ కొరకు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం తేవాలి. ప్రస్తుతం అమలులో ఉన్న సీలింగ్ చట్టాన్ని రద్దు చేసి పది ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు భూపరిమితి నూతన చట్టం చేసి మిగులు భూమిని.. భూమిలేని వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేయాలని తెలిపారు. అలాగే ఆదివాసీలపై వేధింపులు నిలుపుదల చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వ్యవసాయ కార్మికులు అందరికీ ఇవ్వాలి, సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కొరకు ఆరు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కూలీల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. ప్రాథమిక విద్య నుంచి పిజి వరకు గురుకులాల్లో వ్యవసాయ కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని, కొత్తగా ఏర్పడిన కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. 100 రోజుల పని దినాలను 200 రోజుల పెంచాలి.. రోజువారి వేతనం ఆరువందలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, అంజయ్య, రమేష్, అంజమ్మ తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed