- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ వారికి జవాబు చెప్పలేకే సస్పెండ్ చేశారు: బీజేపీ
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఈ నెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావులను ఎదురుకోలేక వారిని సస్పెండ్ చేశారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. వారి ప్రశ్నలకు సీఎం కేసీఆర్ జవాబు ఇవ్వలేక కక్షపూరితంగా ముగ్గురు ఎమ్మెల్యేలను సమావేశం నుండి సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం సంగారెడ్డి పట్టణంలో నల్ల కండువాలతో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో అందర్ని అసెంబ్లీ నుంచి బయటికి పంపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అవహేళన చేసే విధంగా కేసీఆర్ వైఖరి ఉందంటూ దుయ్యబట్టారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు సీఎంకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన మొండి వైఖరిని మార్చుకుని హుందాగా అసెంబ్లీ సమావేశాలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రెడ్డి, ఎల్ మహీందర్, అసెంబ్లీ కన్వీనర్ నర్సారెడ్డి, కౌన్సిలర్ నాయకోటి రమేష్, మందుల నాగరాజ్, జిల్లా యువమోర్చ అధ్యక్షులు పవన్, జిల్లా కార్యదర్శి మురళీధర్ రెడ్డి, పట్టణ నాయకులు రవిశంకర్, విక్రమ్ శంకర్, ఈశ్వరి రెడ్డి, పీడీ సందీప్, సీహెచ్ వినోద్, చంద్రశేఖర్ గౌడ్, లక్ష్మి, మీనా గౌడ్, సంగీత, బొంగుల కవిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.