షారుక్ కేంద్రంగా.. మహిళా స్వాతంత్ర్యం!

by Mahesh |
షారుక్ కేంద్రంగా.. మహిళా స్వాతంత్ర్యం!
X

దిశ, ఫీచర్స్ : ప్రతి హీరోకు అభిమానులుంటారు కానీ మహిళలను ఆకట్టుకునే స్టార్స్ కొందరే ఉంటారు. అలానే నైంటీస్ జనరేషన్‌ అమ్మాయిలకు 'షారుక్ ఖాన్' ఓ రొమాంటిక్ హీరో, వారి కలల రాకుమారుడు. ప్రేమకథా చిత్రాలతో యువతుల మనసులు దోచుకున్న బాలీవుడ్ బాద్‌షా.. క్యాస్ట్, క్లాస్, జియోగ్రాఫికల్ స్టేటస్ వంటి విభిన్న నేపథ్యాల వ్యక్తులకు ఆరాధకుడిగా మారిపోయాడు. ఈ సినిమా అభిమానం.. వర్గ విభజనలను మరిపించి ఒకరి తో ఒకరు సమానంగా మాట్లాడుకునేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో షారుఖ్ అభిమానాన్ని ఉపయోగించి భారత్‌లోని వివిధ తరగతులకు చెందిన మహిళల మధ్య గల సారూప్యతను గుర్తించేందుకు ఆర్థికవేత్త, రైటర్ శ్రయానా భట్టాచార్య ప్రయత్నించింది. ఆ ఫలితాల ప్రతిరూపమే 'డెస్పరేట్‌లీ సీకింగ్ షారుక్ : ఇండియాస్ లోన్లీ యంగ్ ఉమెన్ అండ్ ది సెర్చ్ ఫర్ ఇంటిమసీ అండ్ ఇండిపెండెన్స్'. ఈ పుస్తకం విభిన్న మహిళల ఉద్యోగాలు, కోరికలు, ప్రార్థనలు, ప్రేమ వ్యవహారాలు, స్పర్ధ లతో పాటు ఆర్థిక, వ్యక్తిగత పథాలను మ్యాప్ చేస్తుంది.

నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ మనుషులు తరగతి వారీగా విభజించబడి నప్పటికీ అభిమానం విషయంలో మాత్రం ఐక్యంగా ఉంటారు. ఇదే విషయంలో రైటర్ శ్రయానా 'షారుక్ ఖాన్' అభిమానాన్ని ఉపయోగించుకుంది. షారుక్‌ గురించి ఇండివిడ్యువల్ ఒపీనియన్స్ పక్కన పెడితే అతడు ఈ దేశాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకడిగా ఉన్నాడు. ఈ క్రమంలో షారుక్ చిత్రాలను, 1991 సంస్కరణలను ప్రారంభ పాయింట్లుగా తీసుకుంటే.. మహిళలు తమ జీవితాల గురించి స్వతంత్రంగా మాట్లాడుకునేలా చేస్తుంది. రాజీపడే రోజుల నుంచి తిరుగుబాటు ధోరణి వరకు నారీమణుల జీవితాలను స్పృశిస్తుంది. అంతేకాదు Mr ఖాన్‌పై అభిమానం అసాధారణమైన పరిశోధనా పరికరంగా ఉపయోగపడగా.. పురుషులు, డబ్బు, సినిమాలు, అందం, నిస్సహాయత, ప్రేమ గురించి భారతీయ స్త్రీలు ఏమనుకుంటున్నారో వివరాలను అందిస్తుంది. స్త్రీలు లిబరలైజేషన్ అనంతర భారతదేశాన్ని ఎలా అనుభవించారనే కథనాన్ని వివరిస్తుంది.

ఫోర్ పార్ట్స్

పుస్తకం నాలుగు విభాగాలుగా విభజించబడింది. మొదటి మూడు 'షారుక్' ను ఇష్టపడే ఉన్నత, మధ్య, దిగువ తరగతి మహిళల కథలను తెలియజేస్తాయి. చివరి భాగంలో కుటుంబాలు, కార్యాలయాలు, ఆధునిక శృంగారంలో అసమానత పై స్త్రీలింగ సంభాషణను రూపొందించేందుకు షారుక్ సినిమాలు, పాటలు, ఇంటర్వ్యూలు, పాత్రలు ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ కథలు వివరిస్తాయి. అంతేకాదు ఈ పుస్తకంలో భారతదేశంలో సరళీకరణ, లాక్‌డౌన్ మధ్య కాలంలో వివిధ రకాల శ్రామిక మహిళలు ఎలాంటి పని ఒత్తిడి అనుభవించారో వివరించింది. ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛ, ఆనందం కోసం కొనసాగుతున్న అన్వేషణలో మారుతున్న ఆర్థిక వ్యవస్థ, సమాజ రీతులపై ఓ రోడ్‌మ్యాప్ అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మహిళలు షారుక్‌ను చూసే, కనెక్ట్ అయ్యే విధానంతో పాటు వారు అనుభవించిన ఆందోళనల గురించి అంతర్: దృష్టిని, మహిళల్లో వచ్చిన మార్పులను వివరిస్తుంది.

'2006 నుంచి 2008 మధ్య అనేక రకాల అనిశ్చిత ఉద్యోగాల్లో ఉన్న మహిళల పని పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఉద్దేశించిన అనేక ప్రాజెక్టుల్లో సహాయకురాలిగా పనిచేశాను. సర్వేలో భాగంగా అడిగే ప్రశ్నలు వారికి విసుగు తెప్పించడం తో మధ్య మధ్యలో హిందీ సినిమాల గురించి చర్చించే దాన్ని. ఈ క్రమంలోనే వెళ్ళిన ప్రతి చోట SRK అభిమానులు మిస్టర్ ఖాన్ గురించి విషయాల పై మాట్లాడేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపించడాన్ని గమనించాను. అంటే తమను నిరుత్సాహపరిచిన వాటికి విరుద్ధంగా తమకు సంతోషాన్ని కలిగించే వాటిని బహిరంగంగా చర్చించేందుకు ఇష్టపడుతున్నారని అర్థమైంది. అలా మహిళల సామాజిక-ఆర్థిక వాస్తవాలను అర్థం చేసుకునేందుకు షారుక్ అభిమానం ఒక రిఫ్రెష్ లెన్స్‌గా ఉద్భవించింది. ఈ మేరకు దశాబ్దానికి పైగా సంభాషణలు, Mr ఖాన్ వ్యక్తిత్వం కూడా ఆదర్శప్రాయమైన ప్రమాణాన్ని అందించగా, దీని ద్వారా ఈ మహిళలు.. పురుషులను, వారి చుట్టూ ఉన్న పురుషత్వపు అణచివేత విధానాలను విమర్శించడం ప్రారంభించారు. ఆ విశేషాలే ఈ పుస్తకం'.

పుస్తకంలోని కొన్ని పాయింట్స్ :

* ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఇంటి పెద్ద అనుమతి తప్పనిసరని 80 శాతం మహిళలు వెల్లడించారు.

* ఇంటి పనుల్లో సాయం చేసే పురుషుల విషయంలో భారతదేశం అట్టడుగు స్థానంలో ఉంది.

* భారతదేశంలో 80 శాతం వ్యవసాయ పనులు మహిళలే చేస్తున్నారని ఆక్స్‌ఫామ్ అధ్యయనం వెల్లడించింది.

* 64 శాతం స్త్రీలు తయారీ రంగంలో పనిచేస్తున్నారు.

* కేవలం 5% మహిళలు మాత్రమే వారు ఎవరిని వివాహం చేసుకుంటారనే విషయం పై ప్రత్యేక నియంత్రణ కలిగి ఉంటారు

* ప్రపంచంలోనే సామాజిక చలనశీలత(సోషల్ మొబిలిటీ)లో ఇండియా అత్యల్ప రేటు కలిగి ఉంది.

* ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో లింగ అంతరాలకు సంబంధించి భారతదేశం దిగువనున్న ఐదు దేశాల్లో ఉంది.

* ఒక మహిళ హత్యకు తరచుగా ప్రేమే కారణం గా నిలుస్తోంది.

* స్త్రీలకు అత్యంత ముఖ్యమైన రోల్ 'గృహిణే' అని 80 శాతం విద్యార్థులు పేర్కొనగా, 67 శాతం బాలికలు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

Advertisement

Next Story

Most Viewed