- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళితులు స్వయం శక్తి తో ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ హనుమంతరావు
దిశ, కంది: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతుందని, నిరుపేదలైన దళితులు ఈ పథకం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం కంది మండలంలోని ఉత్తర పల్లి గ్రామంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాజర్షి షా తో కలిసి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దళిత బంధు ద్వారా ఎంపికైన లబ్ధిదారులు మంచి ఆదాయ మార్గాన్ని ఎంచుకుని నెలకు కనీసం 20 నుంచి 30 వేల లాభం వచ్చేలా పని చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఆదాయ సాంకేతిక సలహాలు, సూచనలను లబ్ధిదారులకు ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, స్థానిక సర్పంచ్ బాలయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.