'కప్ ఆఫ్ లైఫ్'.. మెన్‌స్ట్రువల్ కప్స్‌ వాడకంపై కేరళ ప్రభుత్వ ప్రచారం

by S Gopi |
కప్ ఆఫ్ లైఫ్.. మెన్‌స్ట్రువల్ కప్స్‌ వాడకంపై కేరళ ప్రభుత్వ ప్రచారం
X

దిశ, ఫీచర్స్ : ప్రతి మహిళ పీరియడ్స్ టైమ్‌లో అసౌకర్యంతో పాటు నొప్పిని ఎదుర్కొంటుందని తెలిసిందే. ఒకరంగా స్త్రీల విషయంలో మెన్‌స్ట్రువేషన్‌‌ను ఒక యుద్ధంగా పేర్కొనవచ్చు. దీనికి తోడు నెలసరి సమయంలో అనేక పనులపై నిషేధాలు, మూఢ నమ్మకాలు వారిని మానసికంగా వేధిస్తుంటాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న కేరళ ప్రభుత్వం.. మహిళల్లో రుతుక్రమ పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ఒక అడుగు ముందుకేసింది.

'కప్ ఆఫ్ లైఫ్' :

మెన్‌స్ట్రువల్ కప్స్ వాడకాన్ని ప్రోత్సహించేదుకు వీలుగా ఎర్నాకుళం ఎంపీ హిబీ ఈడెన్ 'కప్ ఆఫ్ లైఫ్' ప్రచారాన్ని ప్రారంభించారు. అంతేకాదు తన నియోజకవర్గంలో 24 గంటల్లోనే లక్షకు పైగా మెన్‌స్ట్రువల్ కప్స్‌ ఉచితంగా పంపిణీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ ప్రచారం ద్వారా నెలసరి విషయంలో నెలకొన్న నిషిద్ధాలను రిమూవ్ చేయడంతో పాటు మెన్‌స్ట్రువల్ కప్స్ ప్రయోజనాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కప్స్ వాడకం సులభంగా ఉండటమే కాక దద్దుర్లు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. పైగా టాంపాన్స్ లేదా శానిటరీ నాప్కిన్లు అయితే ప్రతి ఐదారు గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. కానీ మెన్‌స్ట్రువల్ కప్స్‌ను ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేకపోవడంతో పాటు పర్యావరణానికి కూడా అత్యంత అనుకూలమైనవి. ఇదిలా ఉంటే.. 'కప్ ఆఫ్ లైఫ్' లోగోను నటుడు జయసూర్య మంగళవారం కొచ్చిన్‌లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)లో ఆవిష్కరించారు.

ప్రయోజనాలు :

దీని వల్ల పర్యావరణ ప్రయోజనాలు చాలా ఎక్కువ. 2021లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. భారత దేశంలో ప్రతి ఏటా 12.3 బిలియన్ శానిటరీ న్యాప్‌కిన్స్‌ భూమిపైకి చేరుతూ 1,13,000 టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. అంతేకాదు సరిగ్గా వేరు చేయని రుతుస్రావ వ్యర్థాలు పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య ప్రమాదాలను సృష్టిస్తాయి. అదే మెన్‌స్ట్రువల్ కప్స్ చాలా కాలం పాటు వాడుకునే అవకాశం ఉండటమే కాక పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఇక ఒక మెన్‌స్ట్రువల్ కప్‌కు ఒకటి నుంచి రెండు ఔన్సుల రక్తాన్ని హోల్డ్ చేసే సామర్థ్యముండగా.. టాంపాన్స్ మాత్రం ఔన్స్‌లో మూడో వంతు వరకే పట్టుకోగలవు.

Advertisement

Next Story

Most Viewed