హిజాబ్ వివాదంలో హైకోర్టు సంచలన తీర్పు

by Mahesh |   ( Updated:2022-03-15 05:49:07.0  )
హిజాబ్ వివాదంలో హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. గత కొంత కాలంగా విద్యార్థుల యూనిఫార్మ్ విషయంపై కర్ణాటక లో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. హిజాబ్ పాఠశాలల్లో తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్ట్ తేల్చి చెప్పింది. అలాగే అన్ని విద్యాసంస్థల ప్రోటో కాల్స్‌ను అనుసరించాల్సిందిగా కోర్టు తీర్పును ప్రకటించింది. అలాగే యూనిఫామ్ పై విద్యార్థులు అభ్యంతరం తెలపడానికి వీలు లేదని చెప్పింది. అలాగే హిజాబ్ ధరించడం తప్పనిసరి అని ఇస్లాంలో కూడా లేదని స్పష్టత ఇచ్చిన కోర్టు. హిజాబ్ పై నిషేధాన్ని ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు.

Advertisement

Next Story