తెలంగాణలో సైలెంట్​స్ప్రెడింగ్‌లో 'కరోనా'..! ముఖ్యంగా ఆ జిల్లాల్లో ఉధృతి

by Mahesh |
తెలంగాణలో సైలెంట్​స్ప్రెడింగ్‌లో కరోనా..! ముఖ్యంగా ఆ జిల్లాల్లో ఉధృతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్​నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది. ఆదివారం కూడా మరో 705 కేసులు తేలాయి. రాబోయే రోజుల్లో కేసులు ఇంకా పెరుగుతూనే ఉంటాయని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి వేవ్​తరహాలోనే హైదరాబాద్​ను చుట్టు ముడుతున్నది. గత వారం రోజులుగా ప్రతి రోజు డైలీ సగటున సిటీ లో సుమారు 350 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. దీంతో పాటు నల్లగొండ, కరీంనగర్​, ఖమ్మం, వరంగల్​లోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి.

దసరా వరకు కేసుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్​ఉన్నదని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్​లో వ్యాప్తి పూర్తయిన తర్వాత పలెల్లోనే కేసులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని స్టేట్​ ఎపిడమాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత వేరియంటైనా ఒమిక్రానతోనే వ్యాప్తి జరుగుతున్నదని డాక్టర్లు పేర్కొంటున్నారు. మళ్లీ మరో కొత్త వేరియంట్ వస్తే ఈ సారి వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.

ఇమ్యూనిటీ తగ్గడం వలనే..

రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ ​బారిన పడటం, వ్యాక్సిన్ల ద్వారా డెవలపైన ఇమ్యూనిటీ క్రమంగా తగ్గిపోతుంది. దీంతో వైరస్​వ్యాప్తి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మెజారిటీ మెంబర్లు రెండు డోసులు పూర్తి చేసుకున్న, బూస్టర్లు వేసుకోలేదు. మూడో డోసు గడువును ఆరు నెలల గ్యాప్​కు కుదించిన జనాలు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఇంటింటికీ వెళ్లడం, క్యాంపులు ఏర్పాటు చేస్తున్న, బూస్టర్​డోసును వేసుకునేందుకు పబ్లిక్​ ఇంట్రెస్ట్ ​చూపడం లేదు. దీంతో ప్రజల్లో వైరస్​ను తట్టుకొనే శక్తి తగ్గిపోతోందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హులంతా తప్పనిసరిగా బూస్టర్ వేసుకోవడం వలన వ్యాప్తిని అదుపులో ఉంచవచ్చని ఆరోగ్యశాఖ వెల్లడిస్తున్నది.

Advertisement

Next Story