- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నేడే తుది తీర్పు.. MIM శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల క్రితం ఎమ్ఐఎమ్ కీలక నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మత విద్వేశాలు రెచ్చగొట్టేలా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ''మీరు వందకోట్ల మంది ఉన్నారు.. మేము కేవలం పాతిక కోట్ల మందిమే ఉన్నాము. అయినా సరే.. ఓ పదిహేను నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువో చూపిస్తాం.'' అంటూ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్బరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంతేగాక, ఆదిలాబాద్‌లో హిందూ దేవతల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ రెండు కేసులో అరెస్టైన అక్బరుద్దీన్ దాదాపు 40 రోజుల పాటు జైల్లో శిక్ష అనుభవించారు. ఆ మాట రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, నేడు(మంగళవారం) అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువడనుంది. మరి ఈ కేసులో అక్బరుద్దీన్‌కు కోర్టు శిక్ష వేయనుందా? లేదా? అనే వేచి చూడాలి.