Komatireddy Venkat Reddy: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కూ పడుతుంది.. కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్

by GSrikanth |   ( Updated:2022-04-12 07:16:38.0  )
Komatireddy Venkat Reddy: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కూ పడుతుంది.. కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడు జరుగబోయే కేబినెట్ మీటింగ్‌లో వరిధాన్యం కొనుగోలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదని.. చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కూ పడుతుందని హెచ్చరించారు. మీరు నిరసనలు చేస్తే పోలీసులు పట్టించుకోరు.. మేము నిరసనలు చేస్తే అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్ల వర్షాలు బాగాపడి గ్రౌండ్ వాటర్ పెరిగిందని అన్నారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటుంన్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయమంటే రెండు అధికార పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. ఇద్దరి సంగతి ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని సూచించారు.

Advertisement

Next Story