'రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌లో తప్పేముంది'

by GSrikanth |
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌లో తప్పేముంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల పక్షాన రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే.. విమర్శలు చేస్తారా?.. ఎమ్మెల్సీ కవితకు ఇంగితము ఉందా? అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అధికార అహంకారంతో రాహుల్ ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజాయితీ గురించి మాట్లాడే హక్కు వుందా అని, తెలంగాణ ఇస్తే.. పార్టీని విలీనం చేస్తా, దళిత సీఎం, కేజీ టూ పీజీ అన్నారని, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్నీ అమలు చేయని హామీలున్నాయని గుర్తుచేశారు. దగా, కుట్ర, కుతంత్రాలకు అడ్రస్ టీఆర్ఎస్‌గా మారిందన్నారు. ఐకేపీ సెంటర్స్ పెట్టాలంటే ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని, వరివేస్తే ఉరే అన్న సిద్దిపేట కలెక్టర్‌న్ని ఎమ్మెల్సీ చేశారని అన్నారు. పార్లమెంట్‌లో ఎంపీలు డ్రామాలు చేస్తున్నారని, వాళ్లని డ్రామాలు బంద్ చేయలన్నారు.

ఎంపీలకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేయాలన్నారు. చివరి గింజ కొనే వరకూ ఉద్యమిస్తామని అన్నారు. జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, రాజకీయాల కోసం వారిని వాడుకుంటున్నాయని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని కాపాడుతూ.. రైతులకు భరోసా ఇచ్చింది కాంగ్రెసేనని అన్నారు. మోడీ, కేసీఆర్‌ల మధ్య సీక్రెట్ ఎజెండా వుందని, వడ్ల కొనుగోలులో వీధి నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. టీపీసీసీ నేత మల్లు రవి మాట్లాడుతూ.. రాహుల్ ట్వీట్‌లో ఎక్కడ తప్పు ఉంది అని ప్రశ్నించారు. కేంద్ర సర్కార్ వడ్లు కొని రాష్ట్ర సర్కార్‌కు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిచ్చి వాగుడు వాగిండన్నారు. తనకి మంత్రి పదవి రాదని, బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాడని తెలిపారు. రాహుల్ పై మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed