మహిళా గవర్నర్‌ను అవమానించిన టీఆర్ఎస్‌కు ఆ హక్కు లేదు: కాంగ్రెస్

by Javid Pasha |   ( Updated:2022-03-08 07:48:27.0  )
మహిళా గవర్నర్‌ను అవమానించిన టీఆర్ఎస్‌కు ఆ హక్కు లేదు: కాంగ్రెస్
X

దిశ, ఫరూక్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యుల పట్ల స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వైఖరిపై నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్‌ విగ్రహాల వద్ద మూతికి నల్ల బట్టలు కట్టుకుని నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో షాద్ నగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు మూతికి నల్ల బట్టలు కట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వ బండారాన్ని ఎక్కడ బయటపెడతారోనని భయపడి సభ నుండి ప్రతిపక్షాలను సస్పెండ్ చేశారని, ప్రతి పక్షాలు లేకుండా సభలు జరగడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్పీకర్‌ పోచారం వ్యవహార శైలిని మార్చుకోవాలని తెలిపారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టింది ప్రచారానికి తప్ప ప్రజలకు పనికొచ్చే బడ్జెట్‌ కాదని, ఇది తీవ్ర నిరాశను కలిగించిందని అన్నారు. మహిళా దినోత్సవం చేపట్టే నైతిక అర్హత టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని అన్నారు.

గవర్నర్ తమిళసైను అవమానించిన ప్రభుత్వానికి మహిళల పై ఎంత శ్రద్ధ ఉందో అర్థం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాబర్ ఖాన్, బాల్రాజ్ గౌడ్, ఆశన్న గౌడ్, చల్ల శ్రీకాంత్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నాగమణి, తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నల్ల మోని శ్రీధర్, అందే శ్రీకాంత్, ముబారక్ అలీ ఖాన్, ఖదీర్, నాగి సాయిలు, సురేష్, లింగరం యాదయ్య, సుదర్శన్, రాయికల్ శ్రీనివాస్, పులిమామిడి రాజేష్, యాదయ్య, అలీం, శీను నాయక్, సీతారాం, సందీప్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed