వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పర దాడి.. పలువురికి గాయాలు

by samatah |   ( Updated:2022-04-07 06:10:05.0  )
వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పర దాడి.. పలువురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లాలోవైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పర దాడి చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. కొన్ని రోజుల నుంచి ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే అవి కాస్త ముదిరి ఘర్షణకు దారితీసింది. దీంతో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 13 మంది టీడీపీ కార్యకర్తలు, ఆరుగరు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story