- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిడ్డకు సరైన పద్ధతిలో పాలు పట్టకుంటే ఆ సమస్యలు తప్పవు?
దిశ, ఫీచర్స్ : బిడ్డకు జన్మనిచ్చిన అమూల్యమైన క్షణాలను ఆస్వాదించే బాలింతలు.. మరుక్షణంలోనే ఆ ఆనందాలు ఆవిరయ్యే పరిస్థితిని ఎదుర్కొంటారు. శిశువుకు తల్లిపాలు పట్టేటప్పుడు చనుమొనల్లో(నిపుల్) తీవ్ర నొప్పి, వాపును అనుభవిస్తారు. ఇది వారికో సవాల్ కాగా.. అప్పటికే ఇలాంటి సిచ్యువేషన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసిన వారు సాధారణమని సర్దిచెప్తారు. అయితే ఈ సమస్యపై తల్లులకు అవగాహన తక్కువగా ఉన్నందున.. చనుబాలివ్వడం లేదా నిపుల్స్ ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో సూచిస్తున్నారు నిపుణులు.
బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కామన్ ప్రాబ్లమ్స్ :
* నొప్పి
పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు ఏర్పడే సాధారణ సమస్యల్లో నొప్పి ఒకటి కాగా.. పూర్ బేబీ లాచింగ్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. సరైన పొజిషన్‌లో పాలు తాగేలా బిడ్డకు నిపుల్ అందిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
*పగిలిన నిపుల్స్
నొప్పి ఎక్కువ కాలం కొనసాగినపుడు నిపుల్స్‌లో పగుళ్లు ఏర్పడతాయి. ఈ పరిస్థితి బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లిని అసౌకర్యాన్ని గురిచేస్తుంది. అందుకే వీటిపై తక్షణ శ్రద్ధ వహించి సరిదిద్దాలి. రొమ్ముపాలలో ఉండే విటమిన్ E పగుళ్లను నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి.. ఒక చనుమొన పాలను క్రాక్డ్ నిపుల్స్‌కు పూయడం వలన ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే డాక్టర్ మార్గదర్శకత్వంలో క్రీమ్స్, షీల్డ్స్ ద్వారా నయం చేసుకోవచ్చు.
*చనుమొనల పొక్కులు
చనుమొనపై పొక్కులు.. మిల్క్‌తో నిండిన స్మాల్ పింపుల్స్ మాదిరిగా కనిపిస్తాయి. బిడ్డకు పాలిచ్చే విధానంలో మార్పు చేయడంతో పాటు నిపుల్స్‌పై గోరు వెచ్చని కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్‌ను పూయడం, ముతక గుడ్డతో తుడవడం చేస్తే పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. ఇది మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే డాక్టర్‌ను కన్సల్ట్ చేయడం ద్వారా.. స్టెరైల్ నీడిల్ సహాయంతో పొక్కును చీలిస్తే ఉపశమనం పొందగలరు. కాగా చనుమొనపై పొక్కులున్న సమయాల్లోనూ బేబీకి పాలివ్వడం కొనసాగించవచ్చు.
* చనుమొనల వాసోస్పాజమ్
దీన్ని రేనాడ్ దృగ్విషయం అని కూడా పిలుస్తారు. చనుమొనలు పాలిపోయిన తర్వాత తెల్లగా మారడం వలన ఈ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. తల్లిపాలు ఇచ్చే ప్రక్రియలో చనుమొనకు రక్త సరఫరా అంతరాయం కలిగిస్తుంది. ఇది చనుమొన కణజాలం తెల్లబడటం లేదా బ్లాంచింగ్‌కు దారితీస్తుంది. అలాంటప్పుడు వెచ్చని గుడ్డ లేదా హీట్ ప్యాడ్‌ను ఉపయోగించి వెచ్చదనం ఇవ్వడం ద్వారా రక్త ప్రవాహాన్ని పునఃప్రారంభించవచ్చు.
చికిత్స.. చిట్కా..
కొత్తగా తల్లయినవారు డెలివరీ తర్వాత సంభవించే ఏవైనా చనుమొన సమస్యల కోసం లాక్టేషన్ కన్సల్టెంట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు లాచ్ కరెక్ట్ చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను నివారించగలరు. అంతేకాదు నిపుల్ షీల్డ్స్ వినియోగం తగ్గించాలి. లేదంటే ఫ్యూచర్‌లో మరిన్ని నిపుల్ సమస్యలకు కారణం కానుంది. ఫైనల్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ప్రతీ తల్లి తన బిడ్డకు అందించే బెస్ట్ గిఫ్ట్ కూడా. పిల్లలకు పాలివ్వడం సైకిల్ రైడ్ లాంటిది కాగా.. బిడ్డకు పాలిచ్చే పద్ధతి కంఫర్ట్‌గా, జాయ్‌ఫుల్‌గా ఉండాలి.