విద్యుత్ యేతర రంగానికి బొగ్గు సరఫరా పెంచనున్న CIL

by Disha Desk |
విద్యుత్ యేతర రంగానికి బొగ్గు సరఫరా పెంచనున్న CIL
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్ ఇండియా లిమిటెడ్ వద్ద తగినంత స్టాక్ ఉందని పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా విద్యుత్ యేతర రంగానికి బొగ్గు సరఫరాను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం నాన్-పవర్ సెక్టార్ (ఎన్‌పిఎస్)కి రోజుకు 3.4 లక్షల టన్నుల బొగ్గు సరఫరా అవుతుంది. 37 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గును కలిగి ఉన్న CIL ఈ రంగానికి మరింత ఎక్కువ బొగ్గు సరఫరాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021-22 ఏప్రిల్-జనవరి కాలంలో నాన్-పవర్ సెక్టార్‌కి 101.7మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసింది. ఇంతకు ముందు 2019లో ఈ రంగానికి 94 MT లతో పోలిస్తే ఇది 8.2శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తిలో అనూహ్యమైన పెరుగుదల కనిపించింది. వృద్ధి రేటు దశాబ్దంలో అధికంగా ఉంది. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కొరతను తీర్చాల్సిన అవసరం ఉందని, ఆర్థిక సంవత్సరం జనవరి 22 వరకు మొత్తం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 11.2శాతం వృద్ధిని సాధించిందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed