కాంగ్రెస్ నేతకు రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

by S Gopi |
కాంగ్రెస్ నేతకు రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత
X

దిశ, దేవరకద్ర: దేవరకద్ర మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వర్కుటి కొండారెడ్డి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును దేవరకద్ర మండల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇది తెలంగాణ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని, పార్టీలు తమకు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మండల అధ్యక్షుడు జెట్టినరసింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మైన్ దొబ్బలి ఆంజనేయులు, రైతు కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాలరాజు, యువ నాయకులు చల్మారెడ్డి, యుగేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, అంబేద్కర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story