- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం..
దిశ, ఏపీ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో ఓ కుదుపు కుదుపేసిన పెగాసెస్ ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాల్లో కాకను రేపుతున్నది. బెంగాల్ ఎన్నికల సమయంలో అంతకుముందు 2019 ఎన్నికల సందర్భంగా పెగాసెస్ మార్మోగింది. ప్రత్యర్థి పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేయడానికి, వారి వివరాలను హ్యాక్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ను అధికార పార్టీలు వాడుతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగడం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ అనేక ఆరోపణలు చేయడం విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హీట్‌ను రగిలిస్తున్నాయి.
దీదీ ఏమన్నారంటే..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(దీదీ) .. 'జస్ట్ రూ. 25 కోట్లు చెల్లిస్తే చాలు పెగాసెస్ సాఫ్ట్ వేర్‌ను అందజేస్తామని నాకు మూడేళ్ల క్రితమే కొంతమంది నుంచి ఆఫర్ వచ్చింది. కానీ ఆ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీల ఫోన్స్ హ్యాక్ చేయడం వారి కదలికలను పసిగట్టి గెలవడం అనైతికమని భావించా. నేను దానికి ఒప్పుకోలేదు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొందరు మాత్రం దాన్ని కొన్నారు.'' అని చెప్పారు. అయితే రెండు జాతీయ పేపర్లు మాత్రం అలా కొన్నవారిలో అప్పటి ఆంధ్ర రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్లు ఆమె చెప్పినట్టుగా వార్తలు రాశాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కల్లోలం రేగింది. 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపైనా పెగాసెస్ వాడారని వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు.
మమతకు రాంగ్ ఇన్ఫర్మేషన్.. నారా లోకేశ్
'ఒకవేళ 2019 ఎన్నికల్లో టీడీపీ పెగాసెస్ ను ఉపయోగించి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను టీడీపీ ఎన్నటికీ చేయదు. మా హయాంలో పెగాసెస్ ను కొని ఉంటే ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం దానిపై విచారణ జరపకుండా వదిలి ఉండేదా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా పెగాసెస్ వ్యవహారంపై స్పందిస్తూ టీడీపీ పేరు చెప్పి ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆమె మాట్లాడి ఉంటే అది ఆమెకు రాంగ్ ఇన్ఫర్మేషన్. మా పార్టీకి వ్యవస్థల ప్రతిష్ఠ ముఖ్యం.'
ఆ సాఫ్ట్ వేర్ ఏం చేస్తుంది?
పెగాసస్ అనేది ఒక సాఫ్ట్ వేర్ అప్లికేషన్. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ సాఫ్ట్ వేర్ కంపెనీ తయారు చేసింది. అధునాతనమైన టెక్నాలజీతో నిఘా కోసం వాడే సాఫ్ట్ వేర్ ఇదీ. 2016లో ఈ సాఫ్ట్ వేర్.. అరబ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్‌కు చెందిన ఐఫోన్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఓ కంపెనీ తన ఐఫోన్ సాఫ్ట్ వేర్‌ను అప్ డేట్ చేసి, ఎలాంటి హ్యాక్ కు ఫోన్ గురికాకుండా మరింత భద్రం చేసింది.
2017లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను కూడా పెగాసస్ హ్యాక్ చేసిందని సైబర్ నిపుణులు గుర్తించారు. ఫేస్ బుక్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఈ సాఫ్ట్ వేర్ కేవలం నిఘా కోసం వాడేది మాత్రమేనని, ఆ సాఫ్ట్ వేర్‌ను ఎవరైనా మిస్ యూజ్ చేస్తే తమకు సంబంధం లేదని ఎన్ఎస్వో గ్రూప్ ప్రకటించింది. పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను కేవలం అధికారికంగా, ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని, ఏ కంపెనీలకూ సామాన్యులకూ అమ్మబోమని కూడా చెప్పింది. జాతీయస్థాయిలో గతంలో జరిగిన ఎన్నికల్లో దీన్ని గణనీయంగా వాడి ప్రతిపక్ష పార్టీలపై నిఘా పెట్టారన్న ఆరోపణలు ఆయాఆయా పార్టీల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ఈ సాఫ్ట్ వేర్ ఎలా పనిచేస్తుంది..
పెగాసస్ సాఫ్ట్ వేర్ వాడి ఏదైనా ఫోన్ ను హ్యాక్ చేయాలనుకుంటే.. ఆ ఫోన్ కు కొన్ని లింకులను సైబర్ నేరగాళ్లు పంపిస్తారు. వాట్సప్, మెయిల్, మెసేజ్ ద్వారా ఆ లింక్ ఫోన్ కు వస్తుంది. ఆ లింక్ ను క్లిక్ చేయగానే.. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ సాఫ్ట్ వేర్ ఫోన్లో ఇన్ స్టాల్ అయినట్టు యూజర్ కు తెలియదు. ఒక్కసారి పెగాసస్ ఫోన్ లో ఇన్ స్టాల్ అయితే.. ఇక ఆ ఫోన్ లోని సమాచారం అంతా యాక్సెస్ చేసుకోగలదు. ఫోన్ లో ఉన్న ఫైల్స్, చాట్‌ను కూడా అది యాక్సెస్ చేసుకోగలదు. అన్నింటినీ సైబర్ అటాకర్ కు చేరవేస్తుంది. అవతలి వ్యక్తి కదలికలు అన్నింటినీ సైబర్ నేరగాళ్లు తమ గుప్పిట్లో పెట్టుకున్నట్టే. దీన్ని ప్రభుత్వాలు వివిధ నేరస్థులపై నిఘా పెట్టడానికి వాడేలా డిజైన్ చేయబడింది.
చంద్రబాబు ఈ సాఫ్ట్‌వేర్‌ను కచ్ఛితంగా వాడారు: వైసీపీ
'చంద్రబాబు సచ్చీలుడైతే.. నేను పెగసెస్ ను వాడలేదు మమతా బెనర్జీ అబద్ధం చెప్పింది. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని ప్రకటన చేయాలి. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా దర్యాప్తు చేయాలి. ముందుగా చంద్రబాబు, మమతా బెనర్జీ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేయాలి. లేకుంటే చంద్రబాబు తప్పుచేసినట్టు భావించాల్సి వస్తుంది. గతంలో టీడీపీ, ప్రస్తుత చీఫ్ వీప్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఫోన్ ట్యాప్ చేసింది నిజామా కాదా అని' వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.
పెగాసెస్‌ను వాడి ఉంటే.. మీరు గెలిచేవారా: టీడీపీ
'మేము కనుక అధికారంలో ఉన్నప్పుడు పెగాసెస్ వాడి ఉంటే వైసీపీ గెలిచి ఉండేదా?' అని టీడీపీ నేత బీటెక్ రవి వైసీపీ నేతలను ప్రశ్నించారు. '' సమాచార హక్కు చట్ట ప్రకారం 2021 జూలై 25న కర్నూలుకు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా అటువంటిది ఏమీ లేదని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు' అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆ పత్రాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇది పెద్ద దుమారాన్నే సృష్టించే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.