CM KCR: రాజ్‌భవన్‌‌లో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్

by GSrikanth |   ( Updated:2022-06-28 07:08:32.0  )
CM KCR Meets Governor Tamilisai After 9 Months At Raj Bhavan
X

దిశ, వెబ్‌డెస్క్: CM KCR Meets Governor Tamilisai After 9 Months At Raj Bhavan| తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. కాసేపట్లో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేత గవర్నర్ తమిళి పై ప్రమాణ స్వీకారం చేయించనుంది. ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జీలు, బార్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు హాజరు అయ్యారు. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి హాజరైనట్లు తెలుస్తోంది. ఇటీవల రాజ్‌భవన్‌తో పెరిగిన గ్యాప్ దృష్ట్యా సీఎం హాజరుకాకపోవచ్చని భావిస్తున్న అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. కేసీఆర్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అనంతరం గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టీ-హబ్-2 ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం.

Advertisement

Next Story