దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ : హోంమంత్రి

by Javid Pasha |
దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ : హోంమంత్రి
X

దిశ, కోటగిరి : దేశంలోనే తెలంగాణ రాష్టం, సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నారని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 966 రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత మనకే దక్కుతుందన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల కోసం తెలంగాణ రాష్ట్రం 10వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని అన్నారు.

అంతేకాకుండా తొందర్లో రాబోతున్న వివిధ శాఖలకు సంబంధించిన ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. పోటీ పరీక్షల కోసం సొంత ఖర్చుతో సుమారు 1200 వందల మంది విద్యార్థుల కోసం బాన్సువాడ, వర్ని కేంద్రాల్లో ఉచిత కోచింగ్, ఉచిత భోజనం సదుపాయాలు కల్పించడం జరుగుతుందని వివరించారు. మన నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు సుమారు పది వేల ఇళ్లు తీసుకురావడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ప్రతి నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇస్తామని, ఈ ఇళ్ల పంపిణీ కోసం ఎవరైనా అవకతవకలు జరిపి, డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

అనంతరం కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను స్పీకర్, హోం మంత్రులు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ పోచారం భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు, జడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తేళ్ల లావణ్య, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ కుచి సిద్దు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed