- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ సినిమాల్లో అదే వరెస్ట్ సీన్.. దానిపై చిరంజీవిని కూడా అడిగా..!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందరికీ సుపరిచితమే. ఈయన నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ.. ఈ సన్నివేశం కారణంగానే మా జీవితాలు నాశనమయ్యాయి అంటూ ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ ఫోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ గురువారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.. ‘అసలు ఆ సీన్ రాసింది ఎవరో తెలియదు గానీ.. డాక్టర్ వృత్తికి పెద్ద నష్టం చేకూర్చారు. సినిమా మొత్తంలో అదో పెద్ద వరస్ట్ సీన్, అది చూసిన ఎవరైనా సరే డబ్బుల కోసం పేషెంట్‌ని ఐసియూలోకి తీసుకెళ్తున్నారని భావిస్తున్నారు. పొరపాటున పేషెంట్ చనిపోతే దానికి డాక్టర్లు కారణం కాదని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడిందని గురువా రెడ్డి వాపోయాడు.
ఇక చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్.. ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ సందర్భంలో ఠాగూర్‌లోని ఈ హాస్పిటల్ సీన్ గురించి ఆయనతో మాట్లాడా. మీరు చేసిన ఠాగూర్ హాస్పిటల్ సీన్ డాక్టర్లకు మనశ్శాంతి లేకుండా చేసిందని వెల్లడించా. అయితే ఈ సీన్ అంతకుముందు ఇంకా దారుణంగా ఉందని.. తర్వాత చిరంజీవి గారు దాన్ని కాస్త మార్పు చేపించారు” అని డాక్టర్ గురువారెడ్డి వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.