పర్వత గ్రామంలో ఎలక్ట్రిక్ కార్ల సందడి.. 'టెస్లా విలేజ్'‌గా పాపులారిటీ!

by Vinod kumar |
పర్వత గ్రామంలో ఎలక్ట్రిక్ కార్ల సందడి.. టెస్లా విలేజ్‌గా పాపులారిటీ!
X

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. మెట్రో సిటీస్, పట్టణాల్లో పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ కూడా నిర్మిస్తున్నారు. అయితే మారుమూల ప్రాంతాల్లోనే ఎలక్ట్రిక్ కార్ల వినియోగంపై ఇంకా అనుమానులున్నాయి. కానీ చైనాలోని ఒక చిన్న పర్వత గ్రామం(పంజిగా) మాత్రం ఆ సిద్ధాంతాన్ని సవాల్ చేస్తోంది. ఆ గ్రామస్తులు అధిక సంఖ్యలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను కలిగిఉండటంతో 'టెస్లా విలేజ్'గా పేరుగాంచింది.


పట్టణ కేంద్రానికి దూరంగా, మారుమూల ప్రాంతంలో గల పంజిగా గ్రామంలో 40కి పైగా 'టెస్లా' ఎలక్ట్రిక్స్ కార్లు ఉన్నాయి. కాగా పలు చైనీస్ నగరాల్లో పనిచేసిన ఆ గ్రామస్తుడు కై రన్.. తొలిసారి అక్కడి స్థానికులకు టెస్లా బ్రాండ్‌‌ పరిచయం చేశాడు. ఆటోమేటిక్ అసిస్టెడ్ డ్రైవింగ్ ఫంక్షన్, ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్, సొగసైన ఇంటీరియర్ వంటి ప్రత్యేకతలతో పాటు సాంప్రదాయ ఇంధనాన్ని ఆదా చేసే ఈ టెస్లా కారు గురించి రన్ ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు అదే కారును కొనుగోలు చేసేందుకు మక్కువ చూపించారు.


ఈ క్రమంలోనే పంజిగాలో టెస్లా కార్ల సంఖ్య పెరగడంతో అది 'టెస్లా విలేజ్'‌గా మారిపోయింది. ఈ విషయం టెస్లా మేనెజ్‌మెంట్‌కు తెలియడంతో ఎలోన్ మస్క్ స్వయంగా సంతకం చేసిన సూపర్‌చార్జర్‌‌ను పంజిగాలో ఏర్పాటు చేయడం విశేషం.

టూరిస్ట్ అట్రాక్షన్ :

టెస్లా విలేజ్‌ పేరు మారుమోగిపోవడంతో పంజిగాకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కానీ అక్కడ వసతి సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులు తమ కార్లనే క్యాంపింగ్ మోడ్‌లో ఉపయోగించి లోపల రబ్బరు పరుపులతో ఆతిథ్యం అందిస్తున్నారు. ఇటీవలే ఈ గ్రామం గురించి అంతర్జాతీయ మీడియాలోనూ స్టోరీలు రావడంతో రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed