- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపటి నుండి శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
దిశ, స్టేషన్ ఘన్ పూర్: తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పొట్లపల్లి శ్రీధరరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మీ ప్రసన్న తెలిపారు.
స్థల పురాణం..
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని గుట్టపై 14 వందల సంవత్సరాల క్రిందట స్వామి వారు కాలు మోపినట్లు చెబుతున్నారు. పూర్వకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతితో వివాహం జరిగే సందర్భంగా కుబేరుని వద్ద తీసుకున్న అప్పును తీర్చలేక భయం తో చిల్పూర్ గుట్టపై వెలసినట్లు. నాటి నుండి బుగులు వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధికెక్కిన ట్లు స్థలపురాణం చెబుతోంది. ఎత్తైన కొండపై గుహలో తలదాచుకున్న స్వామి వారిని మునులు, ఋషులు పూజించేవారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి రాజు 14వ శతాబ్దంలో స్వామివారి పాదాలు విడిచిన పాదాల గుండు వద్ద ఆలయం నిర్మించారు. కాలక్రమేణా భక్తుల రాక పెరగడంతో 1999లో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరిగింది. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, ఈ ప్రాంత భక్తులకు ఇలవేల్పుగా మారాడు.
వరంగల్ కి 30 కిలోమీటర్ల దూరం..
మన రాష్ట్రంలో రెండో తిరుపతి గా పేరుగాంచిన బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో, ఉమ్మడి స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ఆర్టీసీ బస్సు తో పాటు ప్రైవేటు వాహనాలకు రవాణా సౌకర్యం ఉంది. 9 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు.. ఫాల్గుణ శుద్ధ సప్తమి బుధవారం 9వ తేదీ ఫాల్గుణ శుద్ధ త్రయోదశి బుధవారం 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9న ఉత్సవాలు ప్రారంభం, 10న పరమ పద ఉత్సవం, 11న దీక్ష వస్త్ర ధారణ, కంకణ ధారణ to అంకురార్పణం. 12న ద్వారా తోరణ పతాక పూజ, గరుడ ముద్ద. 13న ఎదుర్కోళ్ళు. 14న శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. 15 బలిహరణం, రథోత్సవం. 16న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, పండితుల సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఏర్పాట్లు పూర్తి.. శ్రీధర్ రావు చైర్మన్
వారం రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్ళు తో పాటు ప్రత్యేక వేదిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ధర్మ కర్తలు, ప్రజాప్రతినిధుల సహకారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రవాణా, వైద్య సౌకర్యాలు ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయని వేసవిని దృష్టిలో పెట్టుకొని వైద్యం, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో కల్పించే వసతులను వినియోగించుకునే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.