ఆ మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువే.. అసెంబ్లీలో సీఎం జగన్‌

by Vinod kumar |
ఆ మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువే.. అసెంబ్లీలో సీఎం జగన్‌
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం బ్రాండ్‌లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వమే ఎన్నో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. 11వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. మద్యం బ్రాండ్లపై టీడీపీ చేస్తున్న ఆరోపణలు, తప్పుడు ప్రచారాన్ని జగన్ ఖండించారు.


'మా బ్రాండ్లు జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, జగనన్న కాలనీలు అని సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు బ్రాండ్లు ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌, బూమ్‌బూమ్‌ బీర్‌ అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. పవర్‌స్టార్‌ 999 బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే అని చెప్పుకొచ్చారు. ఈ బ్రాండ్లన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చినవే తప్ప తాము తీసుకు రాలేదని జగన్ వివరణ ఇచ్చారు. ఈ బ్రాండ్లను మేం క్రియేట్‌ చేసినట్లుగా టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.


ఇప్పుడు ప్రచారంలో ఉన్న లిక్కర్‌ బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలోనివేనని చెప్పుకొచ్చారు. నవరత్నాలు మా బ్రాండ్స్‌ అయితే ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌, బూమ్‌బూమ్‌ బీర్‌, పవర్‌స్టార్‌ 999 బ్రాండ్లన్నీ చంద్రన్న కానుక లేనంటూ మరోసారి సభలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story