- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెండితెరపైకి శివాజీ సినిమా.. 'బాల్ శివాజీ' పేరుతో తెరపైకి..
దిశ, సినిమా: ఛత్రపతి శివాజీ మహారాజ్ 392 వ జయంతి సందర్భంగా అతని జీవితాన్ని సినిమాగా తెరకెక్కించబోతున్న ట్లు నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ తాజాగా ప్రకటించింది. 'బాల్ శివాజీ' పేరుతో రూపొందించనున్న ఈ చిత్రాన్ని ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్- రవి జాద్ ఫిల్మ్స్- లెజెండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు హిందీ, మరాఠీ భాషల్లో తెరకెక్కించనున్నట్లు తెలిపిన డైరెక్టర్ రవి జాదవ్.. 'శివాజీ నిజ జీవిత ఘటనలను వెండితెరపైకి సన్నివేశాలు గా మలచడం కోసం దాదాపు 8 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నాను.
హిందూ పద్ పాద్ షాహీగా పేర్గాంచిన శివాజీ జీవితంలో 12- 16 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. హిందూ సామ్రాజ్య నిర్మాణం, స్వదేశీ వంటి అంశాల విషయమై శివాజీ మదిలో బీజం పడింది ఆ సమయంలోనే. 1630లో జన్మించిన శివాజీ భారత దేశాన్ని పరిపాలించిన మహా రాజులలో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన జీవితం లోని అపూర్వ ఘట్టాలను తెలిపే ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది' అన్నారు.