ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు కేంద్రం నోటీసులు!

by GSrikanth |
ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు కేంద్రం నోటీసులు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అగ్ని ప్రమాదాలకు సంబంధించి కేంద్రం ఆయా వాహనాల తయారీ కంపెనీలకు షోకాజ్ నోటీసులను పంపించింది. ఇందులో ఒలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఈవీ, ఒకినావా కంపెనీలకు ఈ నోటీసులను ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లోపాలు కలిగిన ఈవీలను ప్రజలకు విక్రయించి నందున చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పారని, జూలై నెలాఖరు నాటికి దీనిపై స్పందించాలని స్పష్టం చేసింది.

కంపెనీలు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఇటీవల ఈవీల అమ్మకాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పలు వాహనాల్లో అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి. వరుస సంఘటనల తర్వాత కేంద్రం అప్రమత్తమై ఈవీ అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం ప్రోబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశోధనలో అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు బ్యాటరీ సెల్, డిజైన్ సంబంధించిన అంశాలే కారణమని తేలింది. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదాలకు గురైన ఈవీ కంపెనీలకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) షోకాజ్ నోటీసులను పంపించింది.

Advertisement

Next Story

Most Viewed