- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Wheat Flour Exports:గోధుమ పిండి, మైదా, రవ్వ ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు!
న్యూఢిల్లీ: Central Government has Imposed Sanctions On Wheat Flour Exports| ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిషేధించిన కేంద్రం తాజాగా దాని సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. ప్రస్తుత ఏడాది మేలో కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతులపై ఆంక్షలు అమలు చేయగా, గురువారం నాటి ఉత్తర్వుల్లో గోధుమ పిండి, మైదా, రవ్వతో పాటు ఇతర గోధుమ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల కోసం ముందుగా అనుమతులు తీసుకోవాలని, ఈ అంశాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) ఉత్తర్వులను జారీ చేసింది.
జూలై 12వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమలవుతాయని పేర్కొంది. అంతర్జాతీయంగా గోధుమల సరఫరా సమస్యలు ఉండటంతో గత కొంతకాలంగా ధరలు భారీ పెరిగాయి. ఈ కారణంగానే నాణ్యతా లోపాలు తలెత్తుతున్నాయని, అందుకే తాజా ఉత్తర్వులను జారీ చేసినట్టు డీజీఎఫ్‌టీ వివరించింది. అయితే, గోధుమల మాదిరి గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులపై పూర్తి నిషేధం లేదని స్పష్టం చేసింది. కేవలం, ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదే సమయంలో జూలై 12 లోపు ఎగుమతుల కోసం సిద్ధంగా ఉన్న గోధుమ ఉత్పత్తులకు తాజా ఆంక్షలు వర్తించవచని వెల్లడించింది.
Also Read: ఈ రైల్వే ఉద్యోగి టిక్కెట్లిచ్చే స్కిల్ కేక.. వీడియోతో విజిల్స్!
- Tags
- Wheat