రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ 300 పందుల్ని చంపాల్సిందే..?!

by Sumithra |
రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ 300 పందుల్ని చంపాల్సిందే..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కేరళలోని రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం వాయనాడ్ జిల్లాలో వైర‌స్ క‌ల‌క‌లం రేగింది. మనంతవాడి ద‌గ్గ‌ర‌ ఉన్న రెండు పశుసంవర్ధక కేంద్రాల్లో 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్' (ASF) కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఉన్న‌ రెండు పశుసంవర్ధక కేంద్రాల్లోని పందుల్లో ఈ వ్యాధి నిర్ధార‌ణ అయ్యింది. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో స‌ద‌రు పందుల‌ నమూనాలను పరీక్షించారు. ఒక‌ కేంద్రంలో కొన్ని పందులు మృతి చెందడంతో శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపినట్లు పశుసంవర్థక శాఖ అధికారి తెలిపారు. ఇప్పుడు ఆ ఫలితాలు ASF జ్వరాన్ని నిర్ధారించగా, ఇప్పుడు రెండు సెంటర్ల‌లో ఉన్న‌ 300 పందులను చంపాలని అధికారులు సూచించారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా త‌గు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింన త‌ర్వాత రాష్ట్రాలు ఇప్పటికే బయోసెక్యూరిటీ చర్యలను కఠినతరం చేశాయి. బీహార్‌తో పాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో 'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్' కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది అత్యంత తీవ్ర‌మైన‌ అంటువ్యాధి, ప్రాణాంతక వ్యాధి అని, అధికారులు అప్ర‌మత్తంగా ఉండాల‌ని ఆదేశాలు అందాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచ‌న‌ల‌ ప్రకారం, ఈ వ్యాధి అడవి, పెంపుడు పందుల్లో అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ఈ వైరస్‌ అధిక మరణాలకు దారి తీస్తుంది. అయితే, వ్యాధి నివార‌ణ‌కు ఇంకా టీకా సిద్ధం కాక‌పోవ‌డంతో మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. ఇది మానవులకు ముప్పు కాదు, కానీ పందుల‌ పరిశ్రమను, రైతుల జీవనోపాధిని భారీగా ప్రభావితం చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed