- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయి అడిగిందని బస్సు ఇచ్చాడు, ఇప్పుడు మొత్తుకుంటున్నాడు! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఓ బస్సు డ్రైవర్ ఘనకార్యానికి ప్రతిఫలం భారీగానే వచ్చింది. లైసెన్స్ ఇచ్చి, ప్రయాణికుల్ని భద్రంగా చేర్చమంటే, నఖరాలకు పోయి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు. డ్రైవర్ సహాయంతో ఓ మైనర్ విద్యార్థిని బస్సు నడుపుతున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇంత నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్న వీళ్లెవరని ఆరా తీస్తే విషయం తెలిసింది. ఉదంపూర్-లాండర్ మార్గంలో నడుస్తున్న బస్సును పంచైరిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి నడుపుతుందని అర్థమ్యింది. బాలిక స్టీరింగ్ పట్టుకుని ఉండగా, ఆమె పక్కనే కూర్చున్న బస్సు డ్రైవర్ ఆమెకు వాహనం నడపడం నేర్పిస్తూ కనిపించాడు. ముఖ్యంగా, అదే బస్సులో అప్పుడు చాలా మంది పాఠశాల విద్యార్థులతో సహా కొందరు ప్రయాణికుల కూడా ఉండటం విశేషం.
ఇది కొండ మార్గం కావడంతో అనుభవం లేని వ్యక్తి బస్సు నడపడం అత్యంత ప్రమాదకరం కూడా. చిన్న పొరపాటు జరిగి ఉంటే బస్సు వందల అడుగుల లోయలో పడిపోయేది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను గమనించిన జిల్లా యంత్రాంగం బస్సు డ్రైవర్‌పై వెంటనే చర్యలు తీసుకుంది. ఉదంపూర్ ఏఆర్‌టీఓ జుగల్ కిషోర్ స్పందిస్తూ, జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు బస్సు నంబర్ JK14G-2734 ఇప్పుడు సీజ్ చేశామని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బస్సు డ్రైవర్ లైసెన్స్, పర్మిట్‌లను కూడా రవాణా శాఖ సస్పెండ్ చేసిందని తెలిపారు. బస్సు డ్రైవర్‌ను విచారిస్తున్నారనీ, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
#ViralVideo of negligent #driving: Careless driver lets a girl student drive a #bus full of passengers in J&K's #Udhampur. The license & permit of the driver has now been suspended for endangering lives of passengers. pic.twitter.com/AtdeBWQw4C
— India.com (@indiacom) April 18, 2022