- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారులో కుస్తీ గేమ్ సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్!
దిశ, ఫీచర్స్ : 'కార్-జిట్సు' అనే స్పోర్ట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ తెలియకుంటే 'జియు-జిట్సు' గురించి కూడా తెలిసుండదు. ప్రస్తుతం రష్యన్ సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న ఈ కొత్త కాంటాక్ట్ స్పోర్ట్‌ను ప్రాథమికంగా కారులోనే ప్రాక్టీస్ చేస్తారు. నిజానికి కుస్తీ పట్టేందుకు ఇసుకతో లేదా మ్యాట్‌తో కూడిన గ్రౌండ్ ఉండాలి. కానీ అత్యంత ఇరుకైన ప్లేస్‌లో ఈ గేమ్ ఆడేందుకు దీని సృష్టికర్త కారును ఎంపిక చేయడం విశేషం. ఆ వివరాలేంటో చూద్దాం..
బ్రెజిల్‌కు చెందిన జూడో బ్లాక్ బెల్ట్, ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ 'వికెంటీ మిఖీవ్' కొన్నేళ్ల క్రితం జియు-జిట్సు కనిపెట్టాడు. ఇద్దరు వ్యక్తులు పాల్గొనే ఈ క్రీడలో అపోనెంట్‌ను ఇరుకైన స్థలం కలిగిన కారులో లొంగదీసుకునేందుకు అభ్యాసకులను సవాల్ చేస్తుంది. సీటు బెల్ట్, స్టీరింగ్ వీల్, అద్దాలు, సీట్లు సహా కారు లోపల ఉన్న ప్రతీ వస్తువను మ్యాచ్‌లో పైచేయి సాధించేందుకు ఉపయోగించవచ్చు. కానీ సాధారణ జియు-జిట్సులో వలె కొట్టేందుకు అనుమతించబడదు.
కార్-జిట్సు నియమాల విషయానికొస్తే.. ఇద్దరు పోటీదారులు కారు ముందు సీట్లలో గేమ్‌ను ఆరంభిస్తారు. జియు-జిట్సులో వలె ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ పాయింట్లను స్కోర్ చేయడం లక్ష్యంగా ఆట కొనసాగుతుంది. మ్యాచ్‌లో మూడు నిమిషాలతో కూడిన రెండు రౌండ్లు ఉంటాయి. ఈ రెండు రౌండ్ల తర్వాత వారు టై అయినట్లయితే, పోటీదారులు నాలుగు నిమిషాల రౌండ్ కోసం వెనుక సీటుకు వెళతారు.
'వాహనాల్లో కాంపిటీటివ్ గేమ్ ఆరంభించాలనే ఆలోచనతో 2020 అక్టోబర్‌లో కార్-జిట్సును ఆరంభించాను. కార్-జిట్సు ఆలోచన తెలివితక్కువగా అనిపించినప్పటికీ, దీనివల్ల ఉపయోగముంటుంది. మీరు కారులో వెళుతున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా అటాక్ చేయొచ్చు. అప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకునే ధైర్యముండాలి. కారులోని కొద్ది ప్రదేశంలోనే దుండగుడిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాలి. అలాంటి చిన్న ఆవరణలో సృజనాత్మక మార్గాలను కనుగొనడం వల్ల ఈ ఆట అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి కార్-జిట్సు గేమ్ కేవలం రష్యాలో పాపులర్ అయింది. సమీప భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో పుంజుకుంటుంది'