Janaka Aithe Ganaka: సుహాస్ కొత్త సినిమాకి జనాలు " సారీ జనక " అనేసారుగా..!

by Prasanna |   ( Updated:2024-10-17 15:00:32.0  )
Janaka Aithe Ganaka: సుహాస్ కొత్త సినిమాకి జనాలు  సారీ జనక  అనేసారుగా..!
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో అందరిలా కాకుండా కొంచెం భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటాడు. తాజాగా, జనక అయితే గనక సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. గోపి చంద్, సుధీర్ బాబు సినిమా కన్నా ఈ మూవీకి మంచి రేటింగ్స్ వచ్చాయి. కానీ, ఆశించిన కలెక్షన్లు మాత్రం రాలేదు.

అయితే, ఇప్పుడు అందరూ సుహాస్ మీదే ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలు తీస్తున్నావ్ బాగానే ఉంది, కాకపోతే కొత్త సినిమా ఎంచుకునేటప్పుడే మంచి కథ ఎంచుకో అని సలహాలు ఇస్తున్నారు. ఒకప్పుడు హిట్స్ అందుకున్న ఈ హీరో వరస ఫెయిల్యూర్స్ వల్ల ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. జనక అయితే గనకకు దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ అండగా నిలబడ్డా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ మూవీ మరో బలగం అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఇది నిజం కాలేకపోయింది.

ఓవర్సీస్ హక్కులు కొనుక్కున్న సుహాస్ బోల్తా పడ్డాడు అలాగే తెలుగు అభిమానులు కూడా సారీ జనక అనేశారు. మరి, ఇప్పుడైన స్పీడ్ కి బ్రేక్ వేసి కథకి ప్రాధాన్యత ఉన్నవి ఎంచుకుంటాడో? లేదో ? చూడాల్సి ఉంది.

Advertisement

Next Story