- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్మెట్ పెట్టుకున్న బస్ డ్రైవర్.. ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. చాలా వరకు హెల్మెట్ ధరించ కుండా, వాహనాలను నడుపుతూ ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్స్ అయి ప్రాణాలు కోల్పోతున్న వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తునే ఉన్నాం. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తెచ్చినా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సరే జనాల్లో మార్పు రావడం లేదు. హెల్మెట్ పెట్టుకోకుండా అలాగే వాహనాలను నడుపుతున్నారు.
అయితే ఉత్తర ప్రదేశ్‌లో గాజియాబాద్‌లో ఓ బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక విషయానికొస్తే ఆ బస్సు ముందే రోడ్డు ప్రమాదానికి గురైంది. అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్టు ఫొటోలో కనిపిస్తుంది. దీంతో గాయాల బారిన పడకుండా, గాలి నుంచి రక్షణ కోసం ఆ బస్సు డ్రైవర్ వినూత్న ఆలోచనతో హెల్మెట్ ధరించాడు. ప్రమాదం జరిగిన బస్సును డ్రైవర్ అలాగే డిపోకు తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG
— Piyush Rai (@Benarasiyaa) July 17, 2022