- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాణ దశ నుంచి ఉన్నాం.. మాకు పర్మినెంట్ ఉపాధి కల్పించాలి
దిశ, మణుగూరు: మండలంలోని దమ్మక్కపేట-సాంబాయిగూడెం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ లో నిర్మాణ దశ నుంచి ఈనాటి వరకు పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు ప్లాంట్ లో పర్మినెంట్ ఉపాధి కల్పించాలని నిర్మాణ కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావును మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి ఈనాటి వరకు ప్లాంట్ లో రెక్కలు ముక్కలు చేసుకొని పని చేశామని ఎమ్మెల్యేతో వాపోయారు. ఈనాడు ప్లాంట్ లో పనులు లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ దశ నుంచి ప్లాంట్ ను నమ్ముకుని పని చేశామన్నారు. ప్లాంట్ నిర్మాణం కింద భూములు కోల్పోయినవారికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం తమకు సంతోషంగానే ఉందని, కానీ.. ఈ క్రమంలో కాంట్రాక్ట్ కార్మికులను కూడా తమను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్మికులతో మాట్లాడుతూ... బీటీపీఎస్ సీఈ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కార్మికుల కుటుంబ రోడ్డున పడకుండా చూసుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు.