- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RS Praveen Kumar: మంత్రి వచ్చేదాకా అంబేద్కర్ వద్దకు ఎవరినీ అనుమతించరా?
దిశ, సూర్యాపేట: ప్రోటోకాల్ పేరుతో తనను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం సూర్యాపేటలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌కి నివాళులు అర్పించేందుకు వచ్చిన రాష్ట్ర బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అధికారులు ప్రోటోకాల్ పేరుతో అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి రానున్నారని, మంత్రి తర్వాతే ఎవరైనా అంబేద్కర్‌కు పూలమాల వేయాలని అధికారులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వచ్చేదాకా ఎవరినీ అనుమతించరా? మంత్రి తన వెసులుబాటుతో ఆలస్యంగా వస్తే అప్పటివరకు వచ్చిన వారందరినీ ఆపేస్తారా? అని ప్రవీణ్ కుమార్ అధికారులను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అడ్డుకోవద్దని అధికారులకు సూచించారు. అయినా.. ప్రవీణ్ కుమార్ అసహనం తగ్గలేదు. నివాళులు అర్పించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, దళితులను అంబేద్కర్‌కు దూరం చేయాలనుకోవడం మా హక్కులను హరించడమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతోందని, ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అని అంటుంటే మరోపక్క అధికారులు దళితులను అంబేద్కర్ దగ్గరకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, దీనిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా దళితులను అణచివేసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకున్న వారిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని, వారిపై చర్యలు తీసుకోకపోతే, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
- Tags
- rs praveenkumar