ఆ క్యారెక్టర్‌నే జీవితంగా మార్చుకున్న బ్రూస్.. ఇకపై కనిపించడు

by Javid Pasha |
ఆ క్యారెక్టర్‌నే జీవితంగా మార్చుకున్న బ్రూస్.. ఇకపై కనిపించడు
X

దిశ, సినిమా: హాలీవుడ్ యాక్టర్, 'డై హార్డ్ సిరీస్'కు మారుపేరుగా నిలిచిన 'బ్రూస్ విల్లీస్'.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'డై హార్డ్ ఫ్రాంచైజ్‌'లో ఆయన ఏ క్యారెక్టర్‌లో నటించి మెప్పించారో నిజ జీవితంలో కూడా అలాగే కంటిన్యూ అవుతుండటం విశేషం. అంతేకాదు ఇప్పటికీ తన కుటుంబాన్ని మొత్తం ఉమ్మడిగా ఉంచ‌డం మరో విశేషం. అంతటి మంచి మనసున్న విల్లీస్‌ 67 ఏళ్ళ వ‌య‌సులో 'అఫేసియా' వ్యాధికి గురికాగా దీని ప్రభావం వ‌ల్ల మెద‌డులోని క‌ణాలు నెమ్మదిగా దెబ్బతింటున్నాయని, వినికిడి శ‌క్తి, ఉచ్చర‌ణ లోపం వంటి ల‌క్షణాలు మొదలయ్యాయని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఈ కార‌ణంగానే బ్రూస్ ఇకపై న‌టించ‌బోర‌ని స్పష్టం చేశారు. ఇక ఈ వార్త విన్న అభిమానుల‌ు ఆవేద‌నకు లోనవుతుండగా.. మొదట కామెడీ యాక్టర్‌గా పేరుపొందిన బ్రూస్ విల్లీస్ 'డై హార్డ్'లో తన నటనతో అలరించి హాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఎదిగాడు. భార‌త మూలాలున్న డైరెక్టర్ మ‌నోజ్ నైట్ శ్యామ‌ల‌న్ తెర‌కెక్కించిన 'సిక్స్త్ సెన్స్' మూవీలో బ్రూస్ న‌టన తీరు భార‌తీయుల‌ను క‌ట్టి ప‌డేసింది.

Advertisement

Next Story