Nithiin: నితిన్ ‘రాబిన్‌హుడ్’ బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Hamsa |   ( Updated:2024-11-13 11:33:53.0  )
Nithiin: నితిన్ ‘రాబిన్‌హుడ్’ బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithiin), క్రేజీ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood ). ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే దీనికి జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా మేకర్స్ ‘రాబిన్‌హుడ్’(Robinhood ) నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, నితిన్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు మేకర్స్. ‘రాబిన్‌హుడ్’ టీజర్‌(teaser)ను నవంబర్ 14న సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా నితిన్ పోస్టర్‌ను షేర్ చేసి క్యూరియాసిటీ(curiosity)ని పెంచారు. ఇందులో రెడ్ కలర్ హుడీ, బ్లాక్ మాస్క్‌తో ఉన్న ఆయన స్టిల్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Advertisement

Next Story