- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో 'బ్రైడల్ జ్యూవెలరీ షో'
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోనే అతి పెద్ద బంగారు, వజ్రాభరణాల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్డైమండ్స్ 'బ్రైడ్స్ఆఫ్ ఇండియా'లో భాగంగా బ్రైడల్జ్యువెలరీ షోను ప్రారంభించింది. హైదరాబాద్ సోమాజిగూడలో శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 17వ తేదీ వరకు కొనసాగే ఈ బ్రైడల్ షోలో వివాహభరణాలను ప్రదర్శించనున్నారు. సోమాజిగూడ బ్రాంచ్కస్టమర్మేనేజర్ప్రసన్న మాట్లాడుతూ.. పాతకాలం నుంచి నవయుగపు వధువులు మెచ్చే ఎన్నో డిజైన్లకు ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. కస్టమర్లకు అభిరుచులకనుగుణంగా జైపూర్, అహ్మదాబాద్, రాజ్ కోట్, హైదరాబాదీలకు చెందిన నిపుణులైన కళాకారులు రూపొందించిన పోల్కీ, అనకట్ డైమండ్స్, విలువైన రాళ్లతో కూడిన ఆభరణాల శ్రేణిని ఈ 'బ్రైడల్ జ్యువెలరీ షో'లో ప్రదర్శిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
తేలికైన ఫ్యాషన్, ఫ్యూజన్, సంప్రదాయ డిజైన్లతో అరుదైన సేకరణలను డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ 'మైన్' పేరుతో, రాయల్ డిజైన్లతో సొగసైన అనకట్ వజ్రాలను 'ఎరా' బ్రాండ్ పేరుతో, అందమైన భారతీయ వారసత్వ ఆభరణాలను 'డివైన్' బ్రాండ్ పేరుతో, హస్తకళలతో రూపొందించిన డిజైన్లను 'ఎత్నిక్స్' బ్రాండ్ పేరుతో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందించేందుకు 'ఫెయిర్ ప్రైస్ ప్రామిస్' ను ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్పారు.