Brahmamudi : రాజ్, కళావతి రొమాన్స్ మాములుగా లేదుగా..!

by Prasanna |
Brahmamudi : రాజ్, కళావతి రొమాన్స్ మాములుగా లేదుగా..!
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

అప్పూ, కవి ఇద్దరూ రాజ్‌ని భయపెట్టడానికి.. అతని ముందే టపాసులను పేల్చి భయపడేలా చేస్తారు. రాజ్‌ ను మరింత భయపెట్టడంతో కావ్యను హాగ్ చేసుకుంటాడు. అప్పుడు కావ్య రొమాంటిక్‌గా ఫీల్ అవుతుంది. ఇదంతా చూసిన ఇందిరా దేవి, అపర్ణా దేవి, సీతారామయ్య అందరూ చూస్తుంటారు. ఇక అది చూసిన ఇందిరా దేవి.. ‘రేయ్ రాజ్ అన్నీ ఐపోయాయి ..’ ఇక కావ్యను వదిలేయ్ పట్టుకుంది చాలు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన రుద్రాణీ ‘బయట బాంబులు ఎందుకులే .. ఒకసారి లోపలికి వస్తే అసలైన బాంబ్ చూడొచ్చు’ అంటూ టీవీ దగ్గరకు తీసుకెళ్తుంది.

ఒక ఛానల్‌లో ‘దుగ్గిరాల పరువు మొత్తం పోయింది’ అంటూ కవి ఆటో నడుపుతున్న విజివల్స్ చూపిస్తూ.. ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళ అందరూ షాక్ అవుతారు. "దుగ్గిరాల వారి కుటుంబంలో చీలికలు మొదలయ్యాయా?’ అంటూ వస్తున్న ఆ వీడియోను చూసి అంతా షాక్ అవుతారు. ఇంతలో ధాన్యలక్ష్మీ కోపంగా రుద్రాణీ చేతిలోని రిమోట్ లాక్కొని ఇక ఆపు అని గట్టిగా అరుస్తుంది. వెంటనే కవి దగ్గరకు వెళ్లి.. ‘రేయ్ ఇది నువ్వేనా.. నువ్వు చేసే పని ఇదా .. దీన్ని పోషించడానికి నువ్వు ఈ పని చేస్తున్నావా ? అంటూ రగిలిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed