Brahmamudi October 28 : సుభాష్ చేయి వేయబోతుంటే.. చేతిని విసిరికొట్టి అమ్మోరులా మారిన అపర్ణా

by Prasanna |   ( Updated:2024-10-28 12:40:42.0  )
Brahmamudi October 28 : సుభాష్ చేయి వేయబోతుంటే.. చేతిని విసిరికొట్టి అమ్మోరులా మారిన అపర్ణా
X

దిశ, వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

రాజ్ ఎంత మాత్రం మారడం లేదని అపర్ణా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన సుభాష్ " నీ కొడుకు, కోడలు గురించి ఆలోచిస్తున్నావా అపర్ణా.. అసలు బాధపడకు వాడే మారతాడులే అంటూ కాలు మీద చేయి వేసి ధైర్యం చెప్పబోతుంటే.. ఇందిరా దేవి పక్కన ఉండి అన్నీ చూస్తూ ఉంటుంది.

వెంటనే అపర్ణా అమ్మోరులా మారి సుభాష్ చేయి విసిరికొట్టి ఇలా మాట్లాడుతుంది. ఆపుతావా నీ నాటకాలు .. ఈ వంకతో నాకు దగ్గరవ్వాలని చూస్తున్నావా అని కోపంగా అంటుంది. ఒకప్పుడు ఈ ప్రేమనే చూసి మోసపోయా.. ఇంకోసారి మోసపోవడానికి నేను రెడీగా లేను.. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.. మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను’ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

సుభాష్ ఆ మాటలు వింటూ బాధగా నిలబడిపోతాడు. పక్కనే ఉన్న ఇందిరా దేవి కొడుకు వద్దకు వచ్చి .. ‘ఎందుకురా అలా నీలో నువ్వే నలిగిపోతున్నావ్.. ఒకప్పుడు నువ్వు పెద్ద తప్పు చేశావ్.. కానీ, ఇప్పుడు అంతకుమించి పశ్చాత్తాపంతో ఉన్నావ్.. నువ్వేం బాధ పడకు, ఏదొకరోజు నీ భార్య నిన్ను క్షమిస్తుందిరా’ అని అంటుంది. " నన్ను క్షమిస్తుందన్న ఆశ, నమ్మకం ఇంకా నాకు లేవు.. నేను చేసిన పాపానికి జీవితాంతం ఈ నొప్పిని భరించాల్సిందే.. కానీ, ఒకటే బాధ అమ్మా .. తప్పు చేసింది నేను అయితే, తను కూడా నాతో పాటు శిక్ష అనుభవిస్తోంది.. అది నేను తట్టుకోలేకపోతున్నాను " అంటూ సుభాష్ ఎమోషనల్ అవుతాడు.

Read More..

Naga Manikanta: బిగ్ బాస్ హౌస్ లో 16 మందికి రెండే బాత్రూమ్స్ చాలా ఇబ్బంది పడ్డా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ...

Advertisement

Next Story