వ్యక్తిగత వికాసానికి బంధాల్లో సరిహద్దులు..

by Manoj |
వ్యక్తిగత వికాసానికి బంధాల్లో సరిహద్దులు..
X

దిశ, ఫీచర్స్ : జీవితంలో ప్రతీ పరిచయం వెనుక ఓ పర్పస్ ఉంటుంది. ఈ ప్రయాణంలో మనల్ని పరీక్షించే వారు కొందరైతే.. వాడుకుని వదిలేసేవారు మరికొందరు. అంతేకాదు మనకేదో నేర్పించేందుకు వచ్చేవారు.. మనలోని మంచిని బయటకు తీసేవారు.. ఇలా ఒక్కో బంధం నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాం. ఓ క్షణం బాధ.. మరో క్షణం సంతోషాన్ని అనుభవిస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటాం. కానీ ప్రతీ బంధానికి ఒక సరిహద్దు రేఖ గీస్తే.. ఎలాంటి ఎమోషన్ క్యారీ చేయకుండా అపరిచితులుగా ట్రీట్ చేస్తే.. మానసిక ఆరోగ్యం బాగుండటమే కాక మరెన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

భూమిపై అడుగుపెట్టినప్పటి నుంచి భూమిలో కలిసిపోయే వరకు కొన్ని వేల మందిని కలుస్తుంటాం. మన లైఫ్‌లో ఎంతో మందికి ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుంది. అయితే ఇతరుల పట్ల మనకుండే భావోద్వేగాలపై క్లియర్ విజన్ కలిగి ఉండటానికి.. మనకు నచ్చిన వాటి నుంచి మనం ఇష్టపడని వాటిని వేరు చేయడానికి సరిహద్దులే సహకరిస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మరింత కనికరం, సానుభూతి పెంచుకునేందుకు హెల్ప్ అవుతాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ఆ లిమిట్స్‌ను అర్థం చేసుకుని వారి బిహేవియర్‌ను మార్చుకుంటే.. మరికొందరు మాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తారు. అలాంటి వారు మన లైఫ్‌లో లేకపోవడమే మంచిది.

వ్యక్తిగత వృద్ధి :

ఒక రిలేషన్‌షిప్‌లోని హెల్తీ బౌండరీస్ అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తాయి. మానసికంగా, ఆర్థికంగా లేదా మరే రకంగానైనా వ్యక్తిగత వృద్ధికి సాయపడతాయి. తెలియకుండానే మనలో మార్పులకు కారణమవుతూ.. మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత మెరుగవడంతో పాటు ఎలాంటి మొహమాటం లేకుండా ఎదుటివారికి మన భావాలను వ్యక్తీకరించే విధానంలో మరింత పట్టు కలిగిస్తాయి. సెల్ఫ్ ఎస్టిమేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్‌ క్రియేట్ అవుతుంది. మన చుట్టూ ఉండే సరిహద్దులు.. ఇతరులపై కోపం, పగను తొలిగించి మరింత దయతో వ్యవహరించేలా చేస్తాయి. ఏ విషయంలోనూ అపరాధ భావం లేకుండా హ్యాపీగా ఉండేందుకు కారణమవుతాయి. మొత్తానికి మీ బౌండరీస్‌కు కట్టుబడి ఉంటే.. ఆటోమేటిక్‌గా సేఫ్ రిలేషన్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి.

శ్రద్ధ.. అశ్రద్ధ?

ఇంకా కొన్ని అనారోగ్యకరమైన బంధాలు నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వాటికి లిమిట్స్ ఏర్పాటు చేస్తే.. స్పష్టమైన అంచనాను కలిగి ఉంటే.. మెంటల్ టెన్షన్ ఉండదంటున్నారు నిపుణులు. అనవసర సంఘర్షణకు దారితీసే అవకాశం, అవసరం తగ్గుతుందని సూచిస్తున్నారు. అంతేకాదు మనని ఎవరు నిజంగా కేర్ చేస్తున్నారు? ఎవరు పరిస్థితులకు అనుగుణంగా నటిస్తున్నారు? అస్సలు పట్టించుకోని వారెవరు? అనే విషయంలో క్లియర్ విజన్ ఉంటుంది. ఇది మరింత క్వాలిటీ కంపెనీ కలిగి ఉండేందుకు సాయపడుతుంది. నమ్మకమైన, ఆరోగ్యకరమైన బంధాన్ని బిల్డ్ చేస్తుంది.

హెల్తీ బౌండరీస్..

రిలేషన్‌షిప్‌లో హెల్తీ బౌండరీస్.. ఓ పనిచేసేముందు కచ్చితంగా అనుమతి కోరతాయి. ఇతరుల ఫీలింగ్స్‌కు రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు కృతజ్ఞతాభావంతో ఉంటాయి. అభిప్రాయం, దృక్పథం, భావాల్లో తేడాలున్నా నిజాయితీగా గౌరవించడం, పర్సనల్ స్పేస్ ఆక్రమించకపోవడం, చేసే పనులకు బాధ్యత వహించడం మొదలైనవి.

Advertisement

Next Story