- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ వివాదం తో కొట్టుకున్న ఇరు వర్గాలు
దిశ, క్యాతన్ పల్లి : క్యాతన్ పల్లి పురపాలక కుర్మపల్లి గ్రామం శివారు సర్వే నంబర్ 118 భూమి మాదంటే మాదని రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి లడాయి కి దారి తీసింది. సర్వే నెంబర్ 118 నాలుగు ఎకరాల భూమి కడారి శివయ్య వారి కుటుంబ సభ్యులు తమ వారసత్వంగా వస్తున్న భూమిని అదే గ్రామానికి చెందిన వారు పట్టా చేసుకోవడం జరిగిందని తెలిపారు. కోర్టులో ఈ సర్వే నెంబర్ కు సంబంధించిన భూ తగాదా కేసు ఉండగా, భూమిలో ఎలాంటి అక్రమాలు నిర్మాణాలు చేపట్టరాదని ఇరువర్గాలకు కోర్టు నోటీసులు పంపింది.
గతంలో సర్వేనెంబర్ సంబంధించిన భూ వివాదం కోర్టులో ఉన్నట్లు ఒక వర్గానికి చెందిన వారు పుర కమిషనర్ వెంకటనారాయణ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ మరో వర్గానికి చెందిన వారు వచ్చి లేఅవుట్లు అక్రమాలను చేస్తుండటంతో రెండో వర్గం వారు అడ్డుకోవడంతో మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు ముష్టి యుద్ధానికి పాల్పడ్డారు. భూ వివాదం రాజకీయ నాయకుల పాచికలతో ముదిరి గొడవలకు దారితీస్తుందని గ్రామస్తులు బాహాటంగా చర్చించుకుంటున్నారు.
మందమర్రి, మంచిర్యాల పట్టణాలకు చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలాంటి లిటికేషన్‌లో ఉన్న భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి లే అవుట్ వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఒక వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. యధేచ్చగా వెంచర్లు వేస్తూ అక్రమ లేఅవుట్లను ప్లాట్లుగా మారుస్తున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై సుధాకర్ భూ వివాద ఘర్షణ పడిన ఇరువర్గాల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని అన్నారు.