అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు

by Sridhar Babu |
అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రభుత్వం నిషేధిత అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 44 గుట్కా కేసులకు గానూ 59 మందిని అరెస్టు చేసి రూ.38 లక్షల 38 వేల విలువ గల గుట్కా రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక, రేషన్ బియ్యంతో పాటు గంజాయి అక్రమ రవాణా పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉందని, ఇందుకోసం సరిహద్దు వెంట చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ రవాణా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, అక్రమ రవాణాకు సహకరించే సిబ్బంది పైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed