Justice DY Chandrachud : ఆ వార్తల్లో నిజం లేదు : మాజీ సీజేఐ చంద్రచూడ్

by M.Rajitha |
Justice DY Chandrachud : ఆ వార్తల్లో నిజం లేదు : మాజీ సీజేఐ చంద్రచూడ్
X

దిశ, వెబ్ డెస్క్ : త్వరలోనే తాను ఓ పదవి చేపడతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని మాజీ సీజేఐ డివై చంద్రచూడ్(Justice DY Chandrachud) ప్రకటించారు. త్వరలో మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్(NHRC) గా తాను బాధ్యతలు చేపడతానని, తన పేరును కేంద్రం పరిశీలిస్తోంది అంటూ వస్తున్న పలు వార్తా కథనాల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కుటుంబంతో కలిసి గడుపుతున్నానని.. మరో పదవి స్వీకరించే ఆలోచన ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. తా గురించి వస్తున్న పలు మీడియా కథనాలను ఖండించారు. కాగా గత జూన్ నుంచి NHRC చైర్ పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని భర్తీ చేయడానికి ఇటీవల ప్రధాని మోడీ(PM Narendra Modi) నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం అయింది. ఈ నేపథ్యంలో మాజీ సీజేఐ ఆ పదవి చేపవడతారని పలు మీడియాలో న్యూస్ రాగా.. వాటిని ఆయన కొట్టిపారేశారు.

Advertisement

Next Story

Most Viewed