అక్కడ తప్పించబోయి.. బోల్తా పడ్డింది!

by Vinod kumar |
అక్కడ తప్పించబోయి.. బోల్తా పడ్డింది!
X

దిశ, భిక్కనూరు: కూరగాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం.. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. బోల్తా పడిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కూరగాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం భిక్కనూరు మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం సమీపంలో ఉన్న బైపాస్ వద్ద.. భిక్కనూరు వైపు వెళ్లుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న కూరగాయలు రోడ్డుపై పడిపోగా, వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ వారు కింద పడిపోయిన కూరగాయలను ఏరుకొని ప్లాస్టిక్ బాక్స్ లో నింపుకున్నారు. వెనకాల నుంచి వచ్చిన మరో వాహనాన్ని ఆపి, బోల్తా కొట్టిన వాహనాన్ని పైకి లేపించి, అదే వాహనంలో కూరగాయల బాక్సులను పెట్టుకొని వెళ్లి పోవడం గమనార్హం.



Advertisement

Next Story