- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్ల ధరలను 3.5 శాతం పెంచిన బీఎండబ్ల్యూ!
న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి తన అన్ని మోడళ్ల కార్ల ధరలు పెంచనున్నట్టు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చులు భారీగా పెరిగిన కారణంగా బీఎండబ్ల్యూ మోడళ్లపై 3.5 శాతం వరకు పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మెటీరియల్, లాజిస్టిక్ ఖర్చులు మొదలుకొని, గత కొద్దిరోజులుగా ఉత్పన్నమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మారకం రేట్లలో మార్పుల వల్ల ధరలను పెంచక తప్పటం లేదని కంపెనీ వివరించింది. ప్రస్తుతానికి బీఎండబ్ల్యూ కంపెనీ 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్, 5 సిరీస్, 6 సిరీస్, 7 సిరీస్, ఎక్స్1,ఎక్స్2,ఎక్స్3,ఎక్స్4,ఎక్స్5,ఎక్స్7 మోడళ్లు, మినీ కంట్రీ మ్యాన్ కార్లను స్థానికంగానే ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. అలాగే, స్థానికంగా తన డీలర్‌షిప్ కేంద్రాల్లో 8 సిరీస్ గ్రాన్ కూపే, ఎక్స్6, జెడ్4, ఎమ్2, ఎమ్5, ఎమ్8 సహా పలు మోడళ్లను అసెంబుల్ చేసి విక్రయిస్తోంది. భారత మార్కెట్లో విక్రయిస్తున్న తన అన్ని కార్లపై ధరల పెంపు అమలవుతుందని కంపెనీ వెల్లడించింది.