పన్ను విషయంలో వివాదం.. మెట్రోకు వాటర్ బంద్

by Javid Pasha |
పన్ను విషయంలో వివాదం.. మెట్రోకు వాటర్ బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: మెట్రోకు వాటర్ సప్లై ఆపేయాలని మున్సిపల్ అధికారులు భావించారు. అందుకు కావలసిన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదంతా జరిగింది మహరాష్ట్రలో. అయితే ముంబై మెట్రోకు మున్సిపల్ కార్పొరేషన్‌కు గత కొన్నేళ్లుగా పన్ను విషయంలో వివాదం జరుగుతుంది. 2013 నుంచి మెట్రో యాజమాన్యం ఆస్తి పన్ను జమ చేయడం లేదని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. ఇందులో భాగంగానే అంధేరీ వెస్ట్‌లోని మెట్రో భవానాలకు వాటర్ సప్లై నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

ఈ సందర్భంగా వెస్ట్‌ అంధేరీలో ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎమ్ఎమ్ఓపీఎల్)కు సంబందించిన ప్రతి భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయా భవనాలకకు వాటర్ సప్లై నిలిపివేయాలని నిశ్చయించారు. 2013 నుంచి మెట్రో వారు తమ ఆస్తి కట్టలేదని, అది దాదాపు రూ.300 కోట్లు అయిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మెట్రోకు వాటర్ సప్లై నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో మెట్రో యాజమాన్యం స్పందించింది. మున్సిపల్ అధికారులు తమ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, తమకు పన్ను కట్టేందకు రెండు రోజుల సమయం ఇవ్వాలని మెట్రో యాజమాన్యం కోరింది. దాంతో ముంబై మున్సిపల్ వారు తమ ఉత్తర్వులను వెనక్కు తీసుకుని మెట్రో యాజమాన్యానికి రెండు రోజుల సమయాన్ని కేటాయించారని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story