హోళీ పండగ తర్వాతే ప్రమాణస్వీకారాలు

by Harish |
హోళీ పండగ తర్వాతే ప్రమాణస్వీకారాలు
X

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో హోళీ తర్వాతే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా అదే సమయంలో ఎంచుకోనున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే ఇదే విషయమై నాలుగు రాష్ట్రాలకు సీనియర్ నాయకులను పరిశీలకులుగా ఏర్పాటు చేశారు. నాలుగు రాష్ట్రాల్లోనూ సీనియర్ నేతలు హాజరయ్యే విధంగా ప్రమాణ స్వీకారోత్సవాలను నిర్వహించేందుకు పార్టీ రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 20న ఉత్తరాఖండ్ లో ప్రమాణస్వీకారం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే యూపీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీఎం ఎంపికపై అస్పష్టత నెలకొంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమి తర్వాత ఎవరనే విషయమై పార్టీ ఇంకా తేల్చలేదు. ఇక మణిపూర్ లో బిరెన్ సింగ్ ఉన్నప్పటికీ మరో సీనియర్ నేత పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు గోవా ప్రమోద్ సావంత్ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నా, పార్టీ అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. మరోవైపు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆది, సోమవారాలు ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ ఎంపికపై సీనియర్ నాయకులతో చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed