Raja Singh: రామ్ గోపాల్ వర్మ వేస్ట్ ఫెలో.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్

by GSrikanth |   ( Updated:2022-06-24 09:43:16.0  )
BJP MLA Raja Singh Warns Ram Gopal Varma
X

దిశ, వెబ్‌డెస్క్: BJP MLA Raja Singh Warns Ram Gopal Varma| సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్జీవీపై సీరియస్ అయ్యారు. 'రామ్ గోపాల్ వర్మ వేస్ట్ ఫెలో. తాగి ట్వీట్స్ చేస్తాడు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నా. వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటాడు. ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్‌ను ఖండిస్తున్నాను. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరం. తన తండ్రి ఏ ముఖం పెట్టుకుని దేశం తిరుగుతున్నాడో కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ చేతకాని మంత్రి.'' అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed