- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారిని విస్మరిస్తే నిన్ను కాలగర్భంలో కలిపేస్తారు: విజయశాంతి
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ విద్యార్థులను విస్మరిస్తే ఆయనను కూడా కాలగర్భంలో కలిపేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి బుధవారం ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. ఉస్మానియాలో వసతుల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కే పరిస్థితికి కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. అన్నంలో పురుగులొస్తున్నాయని, పెరుగు, కూరలు సరిగ్గా ఉండట్లేవని ఓయూ క్యాంపస్ లో యువతులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారన్నారు. అయినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రశ్నించే విద్యార్థినులను బెదిరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థులు, ప్రత్యేక తెలంగాణలో వసతుల కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దారి తప్పుతోందని, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకే దళిత బంధు స్కీం వర్తింపజేయడంపై విజయశాంతి ఫైరయ్యారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకే అప్పగించడంతో వారి బంధుమిత్రులనే లబ్ధిదారుగా ఎంపిక చేస్తున్నారన్నారు. జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన బంధువులకే ఇచ్చుకున్నాడని పేర్కొన్నారు. అందులో ఆయన తమ్ముడి పేరుతో పాటు, రఘునాథపల్లి జెడ్పీటీసీ అజయ్కుమార్పేరు లిస్టులో ఉందంటే అధికార పార్టీ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. దళితుల బతుకులతో చెలగాటమాడుతున్న సీఎంను పర్మినెంట్‌గా ఫాం హౌస్‌కి పంపింస్తారని విజయశాంతి జోస్యం చెప్పారు.