- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్: గజ్జల యోగానంద్
దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్, చందానగర్ డివిజన్‌లలో గురువారం జరిగిన ఈ–శ్రమ్ కార్డుల నమోదు, పంపిణీ కార్యక్రమాలలో బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జీ గజ్జల యోగానంద్ పాల్గొన్నారు. ఆయన చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ లోని రోడ్ నెంబర్ 6, రెడ్డి కాలనీ రోడ్డులో పర్యటించి బయోటాయిలెట్స్ ను, ఓపెన్ డ్రైనేజిలను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యాల కోసం అధికార పార్టీ నేతలు ఎన్నో లక్షలు వెచ్చించి కాంట్రాక్టర్ల ద్వారా నిర్మించిన బయో టాయిలెట్స్ నిరుపయోగంగా ఉండడం చూస్తుంటే అధికార పార్టీ నేతలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. లక్షలు వెచ్చించి నిర్మించిన టాయిలెట్స్ లో ఉండాల్సిన నీరు, కుళాయిలు, బకెట్స్, మగ్ వంటివి అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటన్నారు. అన్ని డబ్బులు ఖర్చుపెట్టిన అధికార పార్టీనేతలకు, అధికారులకు వాటి నిర్వహణ తీరుపై కనీస చిత్తశుద్ధి లేదన్నారు.
అభివృద్ధి పేరున కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజా అవసరాల మీద టీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ప్రజల సౌకర్యార్థం బయో టాయిలెట్స్ అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక రోడ్డు ప్రక్కన ఉన్న డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాకేష్ దుబే, బీజేపీ డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రామిరెడ్డి, బీజేపీ మహిళా జనరల్ సెక్రటరీ లలిత, తదితరులు పాల్గొన్నారు.